ఐసీసీ ఛైర్మన్‌గా జై షా మళ్లీ ఎన్నిక!

కలం, వెబ్ డెస్క్: ఐసీసీ ఛైర్మన్‌గా జై షా (Jay Shah) మళ్లీ ఎన్నికయ్యారు. బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో జై షా నాయకత్వాన్ని సమర్థించిన డైరెక్టర్లు.. ఆయన్ను రెండోసారి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. దీంతో, ఆయన త్వరలోనే రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. జై షా నియామకంతో ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఆధిపత్యాన్ని చాటుకున్నట్లయింది. డిసెంబర్ 2024లో తొలిసారి ఛైర్మన్‌గా ఎన్నికైన జై షా.. ఎన్.శ్రీనివాస్, శశాంక్ మనోహర్ తరువాత ఐసీసీ ఛైర్మన్ అయిన మూడో భారతీయ వ్యక్తి మాత్రమే కాకుండా, పిన్న వయస్సులోనే ఆ స్థానాన్ని అందుకోవడం గమనార్హం. అంతకుముందు జై షా బీసీసీఐకి సెక్రటరీగా 2019 నుంచి 2024 వరకు సేవలందించారు. ఆయన హయాంలో2028 ఒలింపిక్స్ పోటీల్లో క్రికెట్‌ను కూడా చేర్చడంలో జై షా పాత్రనే చాలా కీలకంగా మారింది.

Also Read : నేడు సోనియా గాంధీ పుస్తకం ఆవిష్కరణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>