మహారాష్ట్ర–మధ్యప్రదేశ్​ సరిహద్దులో దారుణం.. ఎయిర్ హోస్టెస్ దారుణ హత్య!

కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర–మధ్యప్రదేశ్​ సరిహద్దు ప్రాంతంలో పూణేకు చెందిన 35 ఏళ్ల ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగి (IndiGo Employee) ని వర్ష తుర్కర్ దారుణ హత్య (Murder) కు గురయ్యారు. దీపావళి పండుగ కోసం తన రెండున్నరేళ్ల కుమార్తెతో కలిసి మధ్యప్రదేశ్‌‌లోని పుట్టింటికి వచ్చిన ఆమె హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. వర్ష తుర్కర్ పూణె విమానాశ్రయంలోని ఇండిగో సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె భర్త, కుమార్తెతో కలిసి పూణెలో నివసిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్​ లోని బాలాఘాట్ జిల్లాలో ఉన్న తన పుట్టింటికి వచ్చిన వర్ష, తన స్నేహితుడు నితేష్​ అగర్వాల్ తో కలిసి బయటకు వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో వర్ష వీపుపై నాలుగు సార్లు పొడిచారు. తీవ్ర రక్తస్రావమైన ఆమెను కుటుంబ సభ్యులు ఖైర్లాంజి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

మహారాష్ట్రలోని గోండియా జిల్లా, దౌనివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోండ్రానీ అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. నవంబర్ 14వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును దోపిడీ, హత్య కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>