కలం వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతిలో రెండో దశ భూసేకరణ (Amaravati Land Acquisition) బుధవారం ప్రారంభమైంది. వడ్డమానులో (Vaddamanu) ల్యాండ్ పూలింగ్ కార్యాలయాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ గ్రామంలో 1937 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దీంతో పాటు నేడు సాయంత్రం యండ్రాయి గ్రామంలో సైతం భూసేకరణ జరుగనుంది.
రెండో విడతలో (Amaravati Land Acquisition) పల్నాడు, గుంటూరు జిల్లాలోని ఏడు గ్రామాల్లో భూ సేకరణ చేపట్టనున్నారు. వీటిలో తూళ్లురు మండలంలోని వడ్డమాను, పెదపరిమి, హరిశ్చంద్రాపురం, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి గ్రామాలున్నాయి. ఈ సందర్భంగా అధికారులు ఆయా గ్రామాల్లో రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతిలో మొదటి విడతలో 29 గ్రామాల నుంచి 33,733 ఎకరాల భూమిని సేకరించారు. తాజాగా రెండో దశలో మొత్తంగా 20,494 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఈ భూముల్లో రైల్వే స్టేషన్, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర అభివృద్ధి పనులు జరుగనున్నాయి.
Read Also: ఆ కారణంతో విడాకులు ఇవ్వలేం: తెలంగాణ హైకోర్టు
Follow Us On: X(Twitter)


