రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఊట్లపల్లి గ్రామం(Utlapalli Village)లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నల్లబాడు గ్రామానికి చెందిన దానపు వీర్రాజు అనే యువకుడు తన బైక్‌పై వస్తున్న క్రమంలో ఊట్లపల్లి బ్రిడ్జిపైకి రాగానే అదుపుతప్పి కింద పడిపోయాడు. వీర్రాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికి అందివచ్చిన కుమారుడు విగతజీవిగా మారడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>