ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో యెన్నం హెల్త్‌ కిట్లు పంపిణీ

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన మహిళలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్నప్పుడు, వారి నవజాత శిశువుల సంరక్షణ కోసం యెన్నం హెల్త్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) తెలిపారు. గత ఏడాది నవంబర్ 14న తన సొంత నిధులతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పలువురు నవజాత శిశువుల తల్లులకు శనివారం యెన్నం హెల్త్ కిట్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో తల్లులకు హెల్త్ కిట్లు అందించడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తాను ఎప్పటికప్పుడు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శిస్తూ, అక్కడి పరిస్థితులను సమీక్షించడం ద్వారా వైద్య సేవల మెరుగుదలకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లులు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, పేద కుటుంబాలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ శ్వేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>