కలం వెబ్ డెస్క్ : ఏపీలోని తూర్పు గోదావరి(East Godavari) జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు(Travel Bus) భారీ ప్రమాదానికి గురైంది. బస్సు ప్రయాణిస్తుండగానే పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రయాణికుల(passengers)తో మంగళవారం రాత్రి ఖమ్మం నుంచి విశాఖకు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు(Kovvur) సమీపానికి చేరుకోగానే ఉన్నట్లుండి బస్సులో మంటలు మొదలయ్యాయి. మంటలు మొదలైన కొద్దిసేపటికే కొందరు ప్రయాణికులు గమనించడంతో మిగతా వారిని అప్రమత్తం చేసి అందరూ బస్సు దిగారు. దీంతో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదం హైవేపై జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇటీవల తరచూ ప్రైవేట్ ట్రావెల్స్‌లో అగ్ని ప్రమాదాలు పెరుగుతుండటం కలకలం రేపుతోంది.


