కలం, వెబ్ డెస్క్: ప్రముఖ ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీ ఆరెంజ్ ట్రావెల్స్ (Orange Travels) అధినేత సునీల్ కుమార్‌ను జీఎస్టీ ఇంటెలిజెన్స్ యూనిట్ అరెస్టు చేసింది. నిర్దిష్ట గడువు ముగిసినా జీఎస్టీ బకాయిలను చెల్లించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు హైదరాబాద్ జోన్ డైరెక్టర్ జనరల్ (జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం) ఒక ప్రకటనలో తెలిపింది. సునీల్ కుమార్‌తో పాటు ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.చేతన్‌ను కూడా అరెస్టు చేసినట్లు తెలిపింది. ఆరెంజ్ ట్రావెల్స్ తన వ్యాపారం ద్వారా రూ. 28.24 కోట్ల మేర జీఎస్టీ వసూలు చేసినా దాన్ని ప్రభుత్వానికి చెల్లించలేదని, గడువు దాటి మూడు నెలలైనా బకాయిలు అలాగే ఉండిపోయాయని పేర్కొన్నది. ప్రయాణికుల నుంచి జీఎస్టీ రూపంలో వసూలు చేసినా ప్రభుత్వానికి చెల్లించకపోవడాన్ని పన్ను ఎగవేతగా భావించిన డైరెక్టర్ జనరల్ కార్యాలయం మంగళవారం ఆ ట్రావెల్స్ అధినేత సునీల్ కుమార్‌ను అరెస్టు చేసింది.
ఈ వ్యవహారంలో మాస్టర్ మైండ్‌గా వ్యవహరించిన ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చేతన్ రూ. 22 కోట్ల మేర ఐటీసీ ఫ్రాడ్‌కు పాల్పడ్డారని ఆరోపించిన డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఆయనను కూడా అరెస్టు చేసినట్లు తెలిపింది.

Read Also: కవిత రాజీనామాకి ఆమోదం.. నోటిఫికేషన్ జారీ
Follow Us On: Youtube


