కలం, నిజామాబాద్ బ్యూరో : మానవత్వమే ప్రధాన ధ్యేయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ (Indur Yuvatha) మరోసారి తన సేవా నిరతిని చాటుకుంది. గుర్తుతెలియని ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందగా, ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో ఇందూరు యువత సభ్యులు ఆత్మబంధువులుగా నిలిచి సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నిజామాబాద్ 1వ టౌన్ పోలీసులు చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసిన అనంతరం ఆ అనాథ శవానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఇందూరు యువత సంస్థను కోరడంతో ఇందూరు యువత స్పందించి అన్ని వారై ఆత్మీయులుగా నిలిచి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకటో టౌన్ పోలీస్ సిబ్బంది రాకేష్, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, సంస్థ కోశాధికారి జయదేవ్ వ్యాస్ , రామగిరి సుధాకర్ , ఆఫ్రోజు తదితరులు పాల్గొన్నారు.

