15న ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి​ భేటీ.. కీలక అంశాలపై చర్చ

కలం, వెబ్​ డెస్క్​: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తో సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) సమావేశం కానున్నారు. ఈ నెల 15 వ తేదీన ఢిల్లీలో జరగనున్న ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో పాటు సీఎం రేవంత్..​ మోదీని కలవనున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితులను వివరించనున్నారు. ఎల్​ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరనున్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఉపశమన చర్యలకు సంబంధించి తీసుకోవాల్సి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీని నిధులు కోరనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>