యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సమాచార కమిషనర్

కలం, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (Yadadri ) శ్రీ లక్ష్మీనరసింహస్వామి (Sri Lakshmi Narasimha Swamy Temple ) వారిని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి (Boreddy Ayodhya Reddy) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు.

అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందించి సత్కరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>