తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్లు

కలం, వెబ్ డెస్క్ : కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని టాలీవుడ్ హీరోయిన్లు శ్రీలీల, గౌరీ ప్రియ దర్శించుకున్నారు (Sreeleela Tirumala). శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి వచ్చిన వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి.. వేద పండితులతో ఆశీస్సులు అందుకున్నారు.

సినీ రంగంలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్లు స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయం వద్ద వీరిని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>