బుల్‌డోజర్లే మా రాష్ట్రానికి బ్రాండ్​: యోగి ఆదిత్యనాథ్​

కలం, వెబ్​ డెస్క్​: బుల్డోజర్లు ఉత్తర ప్రదేశ్​ కు ఒక ‘బ్రాండ్’గా మారాయని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంతంలో ఆ కంపెనీ ప్లాంట్‌కు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో యోగి ప్రసంగించారు.

రాష్ట్రంలో ట్రాక్టర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న కంపెనీలు బుల్డోజర్లను కూడా తయారు చేయాలని యోగి ఆదిత్యనాథ్​ సూచించారు. బుల్ డోజర్లు రాష్ట్రానికి ఒక బ్రాండ్‌గా మారాయి.. వాటికి దేశీయంగా, అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉంటుందని ఆయన తెలిపారు.

కాగా, యూపీలో ముస్లింలు, ఇతర అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు బీజేపీ మద్దతుదారులు యోగి ఆదిత్యనాథ్‌ను “బుల్డోజర్ బాబా”గా కొనియాడుతున్నారు. ఈ క్రమంలో బుల్​ డోజర్లు తమ బ్రాండ్ అని సీఎం యోగి (UP CM Yogi Adityanath) ప్రకటించుకోవడంపై చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>