కలం, వెబ్ డెస్క్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నవజాత శిశువుపై వీధి కుక్కలు దాడిచేసిన చేసిన విషాద ఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలి వెళ్లగా, ఆ మృతదేహాన్ని కుక్కులు పీక్కుతిన్నాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన చింతలమానెపల్లి మండలం దిందా గ్రామం (Dimda Village) లో చోటుచేసుకుంది.
అప్పుడే పుట్టిన పసికందును దుండగులు గ్రామ పరిసరాల్లోని రోడ్డుపై పడేసి వెళ్లారు. దీంతో శిశువుపై కుక్కలు దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. శిశువు ఎవరు, ఎప్పుడు అక్కడ వదిలి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

