ఎర్రుపాలెం TSUTF నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!

కలం, ​ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లా ​ఎర్రుపాలెం (Yerrupalem) మండలంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TSUTF) 13వ మహాసభలో నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2026-2027 సంవత్సరానికి గాను ఎన్నికైన ఈ నూతన కమిటీ వివరాలను సంఘం నాయకులు ప్రకటించారు.

​ఈ ఎన్నికల ప్రక్రియను జిల్లా కార్యదర్శి, ఎర్రుపాలెం మండల ఇన్‌చార్జ్ అనుమోలు కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు షేక్ నాగూర్ వలి, జి. రామకృష్ణ, ప్రాంతీయ కార్యాలయం కన్వీనర్ ఎ. వినోద్ రావు, మధిర మండల అధ్యక్షులు బి. నాగరాజు పర్యవేక్షించగా, మధిర మండల ప్రధాన కార్యదర్శి ఇ. వీరయ్య జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ​ఈ మహాసభలో టీఎస్‌యూటీఎఫ్‌ ఎర్రుపాలెం మండల నూతన ఆఫీస్ బేరర్స్‌గా అధ్యక్షులుగా కంచర్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా నండ్రు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా టి. రత్తమ్మ, ఎన్. సైదారావు, కోశాధికారిగా ముండ్రు సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

​కార్యదర్శులుగా సిహెచ్. శివపార్వతి, టి. వెంకటకృష్ణ, ఎన్. పుల్లారావు, ఎన్. సాంబశివరెడ్డి, ఆర్. రామకృష్ణ, కె. సందీప్, టి. ధనలక్ష్మి, కె. కృష్ణవేణి, ఎం. రాజేశ్వరి, కె. సత్యనారాయణ ఎన్నిక కాగా, వివిధ విభాగాల కన్వీనర్లుగా మహిళా కన్వీనర్‌గా ఎస్. వెంకమ్మ, క్రీడా కన్వీనర్‌గా ఎం. నాగేశ్వరరావు, సాంస్కృతిక కన్వీనర్‌గా ఫాతిమా బేగం, వివోటీటీ కన్వీనర్‌గా సీహెచ్. నరసింహారావు, సోషల్ మీడియా కన్వీనర్‌గా షేక్ ఖాజా మొహిద్దీన్‌లు బాధ్యతలు స్వీకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>