దేవుడిపై ఒట్టు.. అంటూ అబద్ధాలతో ప్రజలను నమ్మించే యత్నం: డీకే అరుణ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ ప్రజలు అమాయకులు, ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, దేవుని మీద ఒట్టు.. అంటూ నమ్మ పలుకుతున్నారని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ (DK Aruna)ఫైర్ అయ్యారు. ఇటీవల కొడంగల్ నియోజకవర్గం పోలేపల్లి ఎల్లమ్మ దేవత మీద ఒట్టు అంటూ ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆమె అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ,వివిధ మోర్చాల అధ్యక్షులు, పదాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత ఒత్తిడి ఉన్న సీఎం నియోజకవర్గంతో పాటు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రజలు బీజేపీని ఆదరించి గెలిపించారనీ ఆమె అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యకర్తలు విస్తృతంగా పని చేయాలనీ పిలుపునిచ్చారు. హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందనీ,క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాల పై పోరాటం చేయాలనీ,కేంద్రం నిధులతోనే గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందనే వాస్తవాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలు వివరించాలనీ ఆమె గుర్తు చేశారు.

2 లక్షల ఇండ్లను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి మంజూరు చేసిందనీ,కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లను మంజూరు చేసుకుంటున్నారనీ ,అర్హులైన వారందరికీ ఇండ్లు ఇచ్చేలా కార్యకర్తలు పోరాటం చేయాలన్నారు.మూడేళ్లు అవుతున్న.. అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందడం లేదనీ ఆమె ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం చెందిందనీ, రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటే లక్ష్యంగా, ప్రతి కార్యకర్త సంకల్పం తీసుకొని పని పనిచేయాలన్నారు. కొడంగల్ లో రోడ్ల విస్తరణ పేరిట, బలవంతంగా ప్రజల ఇండ్లను కూల్చివేస్తున్నారనీ, ఆస్తులు కోల్పోయిన వారికి ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదనీ, ఆమె అన్నారు.

రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మడం లేదని, పోలేపల్లి ఎల్లమ్మ పై ప్రమాణం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారనీ,రేవంత్ రెడ్డి ప్రమాణం చేయని దేవుడు రాష్ట్రంలో లేడు. ఏ దేవుడిని రేవంత్ రెడ్డి వదలలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో వేదికగా ఎండగట్టా అన్నారు. పాలమూరు జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులు ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నాయనీ,అబద్ధాలను పదేపదే చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తూ,ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మాయ చేస్తుందనీ,ఆమె విమర్శించారు.

ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం పై విసిగిపోయిన ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున ఆశిస్తున్నారనీ ఆమె తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు చూశారనీ, బీజేపీ కి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనీ ఆమె అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ ఇచ్చే సలహాలు సూచనలతో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సీరియస్‌గా కృషి చేయాలనీ ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌతమ్ రావులు పాల్గొని మార్గదర్శనం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>