కలం, స్పోర్ట్స్: టీ20 ప్రపంచకప్ అందించినా జట్టులో చోటు కోల్పోవడంపై సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఓపెన్ అయ్యారు. మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని, నిజాయతీగా ఉండటం ముఖ్యమని చెప్పారు. వరుస వైఫల్యాలతో జట్టుకు దూరమైన ఆయన, ఇప్పుడు మళ్లీ పాత పట్టుదలను తెచ్చుకున్నట్లు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో మే నెలలో పుట్టిన కుమార్తె తనకు పెద్ద ఊరట నిచ్చిందన్నారు. ‘కూతురి రాకతో దృష్టి అంతా ఆమెపైకి మళ్లి, చోటు కోల్పోయిన బాధ నుంచి సులువుగా తేరుకోగలిగా. తర్వాత మెల్లగా క్రికెట్ వైపే మనసు వెళ్లింది. నా భార్య దేవిషా శెట్టితో మాట్లాడగా.. 15 ఏళ్ల వయసులో ఆటపై ఉన్న ఉత్సాహాన్ని మళ్లీ తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ మాటలతో పాత రోజుల్లో మాదిరి మళ్లీ కఠినంగా శిక్షణ మొదలుపెట్టాను’ అని తెలిపారు.
సచిన్‌ను గుర్తు చేసుకుని..
రంజీ ట్రోఫీ తొలి రౌండ్‌కు ఎంపిక కాకపోయినా నిరాశ చెందలేదని, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలతో గడిపిన రోజులను గుర్తుచేసుకున్నట్లు సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav) వివరించారు. యువ ఆటగాళ్లకు కూడా కేవలం ఐపీఎల్ కాకుండా, దేశం తరఫున ఆడటమే తొలి లక్ష్యం కావాలి’ అని సూచించారు. ఇక సూర్య త్వరలో జరగబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. దేశానికి ఆడే ఆటగాళ్లను తయారు చేయడమే స్థానిక లీగ్స్ అసలైన విజయమని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ పేర్కొన్నారు.
Also Read : హార్దిక్ ఔట్.. ముంబైకి కెప్టెన్ కష్టాలు!
Follow Us On: Youtube

