కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫ్యూజ్ ఎగిరిపోయిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల వద్ద కరెంట్ ఫ్యూజ్ ఎగిరిపోతే రైతులు కొత్త ఫ్యూజ్ వేసినట్టు.. తమ పార్టీ అభ్యర్థులకు రైతన్నలు అండగా నిలవాలని విన్నవించారు. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ కు, నిద్రావస్థలో ఉన్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను విద్యావంతులు అవకాశంగా మలుచుకోవాలన్నారు. పట్టభద్రులంతా కచ్చితంగా ఓటరుగా ఎన్ రోల్ చేసుకొని.. ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆకాష్ కొల్లూరు (Akash Kolluru), నల్గొండ- ఖమ్మం- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ (Srikanth Goud) ను గెలిపించాలని విన్నవించారు.
ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు కూడా డబ్బులు తీసుకుని ఓటు వేస్తారన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉందని కవిత (Kavitha) చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ మోసాలను గ్రాడ్యుయేట్లు తిప్పికొట్టాలన్నారు. రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టయినా సరే తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని ముఖ్యమంత్రి చెబుతున్నాడని ఫైర్ అయ్యారు. పట్టభద్రులంతా డబ్బులు తీసుకుంటారనే అపవాదు తొలగించుకోవాల్సిన అవసరముందని చెప్పుకొచ్చారు.
Also Read :1968లో రాజీవ్‌తో పెళ్లి.. పౌరసత్వంపై 15 ఏళ్ల నిరీక్షణ ఎందుకు? : కంగనా
Follow Us On : WhatsApp

