కలం, నిజామాబాద్ బ్యూరో: ఈసారి హైదరాబాద్ లో జరిగే భారత్ సమ్మిట్–2(Bharat Summit)కు సుమారు 70 దేశాల నుంచి అంతర్జాతీయ నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) తెలిపారు. గత ఏడాది నిర్వహించిన భారత్ సమ్మిట్–2025కు దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు హాజరై విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ సదస్సులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులు, పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు పాల్గొన్నారని గుర్తుచేశారు.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకురావడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలపై చర్చలకు ఈ సదస్సు కీలక వేదికగా నిలవనుందని అన్నారు. భారత్ సమ్మిట్‌ను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ, అన్ని వర్గాల భాగస్వామ్యంతో ఈ సదస్సు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief) కోరారు.
Also Read : రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త
Follow Us On: Youtube

