కలం, వెబ్ డెస్క్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఢిల్లీ పర్యటలో బిజీబిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘భారత్ సమ్మిట్’ కార్యక్రమానికి రావాల్సిందిగా రాహుల్ గాంధీకి ఆయన అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
అలాగే తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, కులగణన సర్వే పురోగతి, ఓబీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యత కల్పించే అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. అంతేకాకుండా, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయడంపై రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ (Mahesh Kumar Goud) సమాలోచనలు జరిపినట్లు సమాచారం. రాహుల్ గాంధీ సూచనలకు అనుగుణంగా త్వరలోనే తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగనుంది.
Also Read : ‘ఫ్యూచర్ సిటీ’ పై బిగ్ అప్డేట్.. 71 గ్రామాల్లో అంతర్జాతీయ నగర నిర్మాణం!
Follow Us On: X(Twitter)

