epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘SIR’​ ఎఫెక్ట్.. యూపీలో 2.8 కోట్ల ఓట్లు తొలగింపు

కలం, వెబ్​ డెస్క్​ : ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) పలు రాష్ట్రాల్లో SIR (స్పెషల్​ ఇంటెన్సివ్​ రిపోర్ట్​) ప్రక్రియ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఉత్తర్​ ప్రేదేశ్​ లో ఓటు సోమవారం ఈసీ ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసింది. యూపీలో 2.89 కోట్ల ఓట్లను తొలగించారు. వీటిలో 46 లక్షల మంది మరణించిన వారు ఉండగా.. 2.17 కోట్ల ఓటర్లు ఇతర ప్రాంతాలు వెళ్లిన వారున్నారు. 25.47 లక్షల మందికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల (డూప్లికేట్ ఓట్లు) ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఈసీ వెల్లడించింది.

SIR సవరించిన ఓటర్ల జాబితా పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తమ పేర్లు లిస్టులో లేకున్నా ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఫిర్యాదుల పరిశీలించిన అనంతరం మార్చి 6న ఫైనల్​ లిస్ట్ రిలీజ్​ చేసే అవకాశాలున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్​ లో 15.44 కోట్ల ఓట్లు ఉండగా.. తాజా ముసాయిదా జాబితా ప్రకారం 12.56 కోట్లకు తగ్గింది. ఇది దాదాపు 18.7 శాతం ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>