కలం, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తుందని వైసీపి చేస్తున్న ఆరోపణలపై మంత్రి నిమ్మల (Minister Nimmala) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ మీద మొసలి కన్నీరు కారుస్తుంటే ఆ రాయలసీమ ప్రజలే విస్తుపోతున్నారు. 50 శాతం ఓట్లు, 151 సీట్లతో ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే రాయలసీమ కోసం ఏం చేశారని రాయలసీమ వాసులే మాజీ సిఎం జగన్‌ను ప్రశ్నిస్తున్నారు.
రాయలసీమలో ప్రారంభమైన ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనివే అని, జగన్ హయాంలో పూర్తి కాని ప్రాజెక్టులను సైతం జాతికి అంకితం ఇచ్చారని మంత్రి నిమ్మల విమర్శించారు. సెట్టింగులు వేసి జనాలను మోసం చేసిన జగన్ ‘సెట్టింగుల ముఖ్యమంత్రి’ అంటూ నిమ్మల మండిపడ్డారు. ఆనాడు అన్న ఎన్టిఆర్, ఈనాడు చంద్రబాబు హయాంలోనే రాయలసీమకు ఎక్కువ లాభం జరిగిందని మంత్రి నిమ్మల తెలిపారు.


