భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి 2027 టీటీడీ క్యాలెండర్లు

కలం, వెబ్ డెస్క్: నూతన సంవత్సరం 2027ను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్లు (TTD 2027 Calendars), డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా భక్తులు వీటిని సులభంగా బుక్ చేసుకోవచ్చు. అలాగే తిరుపతి, తిరుమల, తిరుచానూరులోని టీటీడీ ప్రచురణల విక్రయ విభాగానికి చెందిన 12 కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌తో పాటు విజయవాడ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, దిల్లీ, ముంబయి నగరాల్లో ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల ద్వారా కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. 2027 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు(TTD 2027 Calendars), డైరీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2026 సెప్టెంబరు 7న అధికారికంగా ఆవిష్కరించారు. అదే రోజు నుంచి వాటి విక్రయాలను టీటీడీ ప్రారంభించింది.

Also Read : ఉద్యోగుల సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>