కలం, కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల నూతన ఎస్సైగా వి.రమేష్ (SI Ramesh) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన బైరు గోపి ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఖమ్మం టూ టౌన్‌లో ఎస్సైగా ఉన్న రమేష్ బదిలీపై కారేపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతలను కాపాడటమే తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

