రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఐక్య పోరాటాలే శరణ్యం: పోతినేని సుదర్శన్

కలం, ఖమ్మం బ్యూరో: వ్యవసాయ రంగాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఐక్య పోరాటాలే శరణ్యమని, కార్పొరేట్ దోపిడీ విధానాలను తిప్పికొట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాట పురిటిగడ్డ అయిన నల్లగొండ పట్టణ వేదికగా నవంబర్ 15 నుండి 18 వరకు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు (AIKS National Conference) ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఈ మహాసభల ప్రారంభ సూచికగా నవంబర్ 15న తలపెట్టిన లక్ష మంది కర్షకులతో కూడిన భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.

​సోమవారం ఖమ్మం సుందరయ్య భవనంలో మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబులతో కలిసి ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనుసరిస్తున్న వినాశకర విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికా సామ్రాజ్యవాద ఒత్తిళ్లకు తలొగ్గి దేశీయ వ్యవసాయ రంగాన్ని విదేశీ శక్తులకు, కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ​ఢిల్లీ వేదికగా దేశ రైతాంగం ఐక్యమై సాగించిన చారిత్రాత్మక పోరాట స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేసేందుకు ఈ మహాసభలను (AIKS National Conference) నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. “దున్నేవాడికి భూమి కావాలి” అనే నాటి నల్లగొండ చైతన్య వారసత్వంతో.. “కార్పొరేట్ల దోపిడీ నశించాలి – వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవాలి” అనే బలమైన నినాదంతో ఈ మహాసభలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు యం. సుబ్బారావు, కళ్యాణ వెంకటేశ్వరరావు, తుమ్మ విష్ణువర్ధన్, వాసిరెడ్డి ప్రసాద్, ఎస్.కె. మీరా, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, పడగల నాగేశ్వరరావు, నామా లక్ష్మి నారాయణ, రెడపంగి ప్రకాష్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మధు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఉద్యోగుల సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>