కలం, సినిమా: సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ “వేట్టువం” (Vettuvam) టైటిల్‌తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, వీఆర్. దినేష్ శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “వేట్టువం” సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్స్ ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్ నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న “వేట్టువం” సినిమా వచ్చే సంక్రాంతి పండక్కి వరల్డ్ వైడ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా సోమవారం “వేట్టువం” సినిమా నుంచి మేకర్స్ ‘సెలబ్రేట్ రెసిలియన్స్..’ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ తమ సహనాన్ని పరీక్షించే సందర్భం వచ్చినప్పుడు ఎలా తట్టుకుని నిలబడ్డాయో, తమ శక్తిని ఎలా ప్రదర్శించాయో చూపించడం ఈ వీడియోలో ఆకట్టుకుంటోంది. విభిన్న సమూహాల మధ్య ఉండే సంఘర్షణలు, పోరాటాలు, ఊహకందని సంఘటనలను ప్రధానాంశంగా తీసుకుని దర్శకుడు పా. రంజిత్ “వేట్టువం” సినిమాను రూపొందిస్తున్నారు. “వేట్టువం” పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించబోతోంది.

