కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో సిరీస్ మధ్యలోనే టీమిండియా కోచింగ్ సిబ్బంది (Team India Coaching Staff) రెండు గ్రూపులుగా విడిపోనున్నారు. మూడో వన్డే తర్వాత ఈ మార్పు జరగనుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే వన్డే జట్టుతోనే కొనసాగనున్నారు. మిగిలిన సిబ్బందిలో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ టెస్టు జట్టుతో కలిసి పని చేయనున్నారు. ఈ విషయాన్ని కోటక్ వెల్లడించారు. అయితే తుది నిర్ణయం గంభీర్‌దేనని, ప్రణాళికలో మార్పులు ఉండొచ్చని స్పష్టం చేశారు.
మరోవైపు వన్డే జట్టులోని ముగ్గురు పేసర్లు గుర్నూర్ బ్రార్, ఔకిబ్ నబీ, అర్ష్‌దీప్ సింగ్ కూడా న్యూజిలాండ్‌లోనే ఉండనున్నారు. టెస్టు జట్టు ప్రాక్టీస్‌లో నెట్ బౌలర్లుగా, అవసరమైతే రిజర్వ్ ఆటగాళ్లుగా సేవలు అందించనున్నారు. టెస్టు సిరీస్ కోసం నవంబర్ 11 నుంచి ప్రత్యేక శిక్షణ శిబిరం ప్రారంభం కానుంది. తొలి టెస్టు నవంబర్ 19న మొదలవుతుంది. అంతకుముందు ఐదు నుంచి ఆరు ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించనున్నారు.
ఇప్పటికే వన్డేల్లో ఎదురైన స్వింగ్, సీమ్ మూవ్మెంట్, అసమాన బౌన్స్ టెస్టులకు ఉపయోగపడతాయని కోటక్ తెలిపారు. భారత్ ఏ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లు కూడా టెస్టు ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించాయని పేర్కొన్నారు.
Also Read : శాండ్‌పేపర్ వివాదంపై స్పందించిన డేవిడ్ వార్నర్
Follow Us On : WhatsApp

