నిజామాబాద్‌లో ఒకే రోజు 125 మందిపై కేసులు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీసు (Nizamabad Police) కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్బంగా ఏడో తేదీ నుండి తొమ్మిదో పేకాట ఆడుతున్న 649 మందిని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 125 కేసులు నమోదు చేసినట్టు పోలీసు కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. మొత్తం 13,07,38 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ డివిజన్ లో మొత్తం కేసులు 29 కాగా పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులు 175 మంది అని చెప్పారు. మొత్తం రూపాయలు 5,25,370 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఇక‌ ఆర్మూర్ డివిజన్ లో మొత్తం కేసులు 26 , పేకాట ఆడుతూ పట్టుబడిన మొత్తం 131 మంది, మొత్తం రూపాయలు 2,20,760 స్వాధీనం చేసుకున్నట్టు వెల్ల‌డించారు. బోధన్ డివిజన్ లో మొత్తం కేసులు 70 , పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులు 343 మంది , మొత్తం రూపాయలు 5,61,250 స్వాధీనం చేసుకున్న్నామని వివరించారు. మూడు డివిజన్ ల మొత్తం కేసులు 125 కాగా మూడు డివిజన్ లో పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులు మొత్తం 649 మందిగా చెప్పారు. మూడు డివిజన్ ల పట్టుబడిన మొత్తం రూపాయలు 13,07,380 నగదు పట్టుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై నియం త్రించడానికి ప్రత్యేక నిఘా , ప్రత్యేక టీం, కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని సిపి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>