కలం, నారాయణపేట : తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ & కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్, హైదరాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద, అర్హులైన మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ (Free Coaching), స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఏమి రషీద్ తెలిపారు. TGPSC గ్రూప్స్-I, II, III, IV, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు సిద్ధమవుతున్న ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మైనారిటీ వర్గాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అన్నారు.
అభ్యర్థులు మైనారిటీ ధృవీకరణ పత్రం, విద్యార్హత ధృవీకరణ పత్రం, పోటీ పరీక్ష దరఖాస్తు / రిజిస్ట్రేషన్ ప్రతిని, అలాగే పాఠశాల ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో జతచేసి ఈనెల 12వ తేదీ లోగా జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయం, నారాయణపేట లో దరఖాస్తు సమర్పించాలని వెల్లడించారు. అర్హులైన మైనారిటీ నిరుద్యోగ యువత ఈ ఉచిత సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం ఏ.రషీద్ కోరారు.

