కలం, వెబ్ డెస్క్: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు (Musi Project) భూసేకరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు లేకుండానే పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం కాకుండానే టెండర్లు ఎలా పిలుస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న సమయంలో ప్రజలను, రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టకుండా మూసీ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయిన్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యత ఇవ్వడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని తుగ్లక్ పాలన అనకపోతే ఇంకేమనాలి? అంటూ రేవంత్ రెడ్డిపై ఆయన (KTR) విమర్శలు చేశారు.
Also Read : దీపావళి వేడుకల్లో అపశృతి.. బాణాసంచా కాలుస్తూ పలువురికి గాయాలు
Follow Us On: Youtube

