“పబ్లిక్ లేకుండా పబ్లిక్ హియరింగ్”.. మూసీ భూసేకరణపై కేటీఆర్ ఆగ్రహం

కలం, వెబ్ డెస్క్: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు భూసేకరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు లేకుండానే పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం కాకుండానే టెండర్లు ఎలా పిలుస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న సమయంలో ప్రజలను, రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టకుండా మూసీ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయిన్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యత ఇవ్వడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని తుగ్లక్ పాలన అనకపోతే ఇంకేమనాలి? అంటూ రేవంత్ రెడ్డిపై ఆయన (KTR) విమర్శలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>