దీపావళి వేడుకల్లో అపశృతి.. బాణాసంచా కాలుస్తూ పలువురికి గాయాలు

కలం, వెబ్ డెస్క్: దీపావళి సంబరాలు హైదరాబాద్‌ (Hyderabad) లోని కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపాయి. పండుగ సందర్భంగా టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు పలువురు కంటి గాయాలపాలయ్యారు. గాయపడిన బాధితులు చికిత్స కోసం మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి పోటెత్తారు. దీపావళి వేడుకల్లో ఇప్పటివరకు మొత్తం 82 మంది కంటి గాయాలతో ఆసుపత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 12 మందికి ఆసుపత్రిలో అడ్మిట్ చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో 60 మందికి ఓపీ విభాగంలో వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.

ఆసుపత్రిలో చేరిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరికొందరికి స్వల్ప గాయాలయాలతో బయటపడ్డారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా టపాసులు కాల్చేటప్పుడు పిల్లలు, పెద్దలు అప్రమత్తంగా ఉండాలని, కళ్లకు గాయాలైతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. కాగా, సరోజిని దేవీ కంటి ఆస్పత్రితో పాటు నగరంలోని పలు ఆస్పత్రిలో చికిత్స కోసం ప్రజలు వెళ్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>