భోగి ట్రైలర్ లాంచ్ వాయిదా.. ఏం జరిగింది?

క‌లం, సినిమా: డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెలంగాణ‌లోని ఆదిలాబాద్‌లో ఉన్న బొగ్గు గుట్ట‌ల నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న టాలీవుడ్ లేటెస్ట్ మూవీ భోగీ (Bhogi). ఈ సినిమాలో శ‌ర్వానంద్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గ‌తంలో ఈ జోడీ శ‌త‌మానం భ‌వ‌తి వంటి హిట్ మూవీలో న‌టించారు. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే అనుప‌మ‌, శ‌ర్వా లుక్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే తెలంగాణ యాస‌లో ఉన్న ఒక పాట‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా న‌వంబ‌ర్ 12న రిలీజ్ కానుంద‌ని అప్ప‌ట్లో మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ట్రైల‌ర్ లాంచ్ చేయ‌నున్న‌ట్లు ముందే ప్ర‌క‌టించారు. కానీ, స‌డెన్‌గా ట్రైల‌ర్ లాంచ్ వాయిదా ప‌డిన‌ట్లు చెప్పారు. దీంతో సినిమా విడుద‌ల పైనా అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>