బాసరలో క్వాంటమ్ టెక్నాలజీపై ఎఫ్‌డీపీ ముగింపు

కలం, బాసర : బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (Basara RGUKT) లో క్వాంటమ్ టెక్నాలజీపై (Quantum Technology) నిర్వహించిన మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌డీపీ) శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా క్యూక్లైర్‌వాయన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ సంస్థ వ్యవస్థాపకులు కల్నల్ (రిటైర్డ్) సాయి శంకర్ పి. సుమారు రూ.40 లక్షల విలువైన 40 క్వాంటమ్ సాఫ్ట్‌వేర్ లైసెన్సులను విశ్వవిద్యాలయానికి ఉచితంగా అందించారు. వీటి ద్వారా 40 మంది విద్యార్థులకు ఆరు నెలలపాటు ఉచిత క్వాంటమ్ టెక్నాలజీ సర్టిఫికేషన్ కోర్సు నిర్వహించనున్నారు. ముగింపు కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో క్వాంటమ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

Also Read : గంజాయి క్వీన్ అరెస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>