కంజర్ గ్రామ భూముల సమస్యలపై కలెక్టర్ ఆరా

కలం, లక్ష్మణచందా : లక్ష్మణచందా మండలం కంజర్ గ్రామ భూముల సమస్యలు (Kanjar Land Issues) త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కంజర్ గ్రామస్తుల భూముల సమస్యల పరిష్కార విషయంపై మండల తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భూ సమస్యల దరఖాస్తుల సంఖ్య, సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు.
ప్రతి దరఖాస్తుకు సంబంధించి వివరాలు క్లుప్తంగా నమోదు చేయాలని అన్నారు. దరఖాస్తుల వివరాలన్నీ పకడ్బందీగా నమోదు చేయాలని చెప్పారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి వచ్చే దరఖాస్తులన్నీ ఎప్పటికప్పుడు పష్కరిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే దరఖాస్తులను పై స్థాయికి పంపాలని అన్నారు. మండలంలో భూముల రీ సర్వే ప్రక్రియను సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకట మాధవ రావు, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్ సరిత, ఎంపిడివో వనజ, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>