కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించిన గణేష్‌కు పదోన్నతిపై ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్) సూపరింటెండెంట్‌గా బదిలీ కావడంతో శనివారం కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సన్మానం (Farewell Ceremony) నిర్వహించారు. ఈ సందర్బంగా గణేష్ సేవలను కొనియాడుతూ శాలువా, పూలమాల, జ్ఞాపికతో సత్కరించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యు. గంగాధర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగ శ్రీనివాస్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.