‘పరిషత్’ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం..!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ (AP MPTC ZPTC Elections) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతోంది. ప్రారంభ రౌండ్ల నుంచే అధికార ఎన్డీయే కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ విజయాల వైపు దూసుకెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కూటమి వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు ప్రారంభ ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, వైసీపీ కేవలం 14 స్థానాలకే పరిమితమైంది. అలాగే ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి భారీ ఆధిక్యాన్ని నమోదు చేసింది. కూటమి అభ్యర్థులు 1,968 స్థానాల్లో ముందంజలో ఉండగా, వైసీపీ 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే పరిషత్ ఎన్నికల్లో(AP MPTC ZPTC Elections)నూ విపక్ష వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,815 ఎంపీటీసీ, 659 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 365 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు శరవేగంగా జరుగుతోంది. లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా సాగేందుకు అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల నిఘా మధ్య కౌంటింగ్ కొనసాగుతుండగా, పూర్తి స్థాయి ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి.

Also Read : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>