గచ్చిబౌలిలో కలకలం.. హోటల్ గదిలో అమెరికా పౌరుడి మృతదేహం!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి (Gachibowli) లో ఓ అమెరికా పౌరుడు అనుమానాస్పదంగా మృతిచెందిన (American Citizen Death) ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్​టించింది. SLN టెర్మినస్ లోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. మరణించిన వ్యక్తిని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మిచేల్ బ్రియాన్ లీ (41) గా పోలీసులు గుర్తించారు.

వ్యాపార సంబంధిత పనుల కోసం మిచెల్ నవంబర్ 2వ తేదీన తన భాగస్వామి డేవిడ్ వూతో కలిసి హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని మారియట్ అపార్ట్‌మెంట్స్‌లో 12వ అంతస్తులోని రూమ్ నంబర్ 1218లో వారు బస చేశారు.

అయితే నవంబర్ 5వ తేదీన సాయంత్రం ఆయన ఫోన్ కాల్స్‌కు స్పందించకపోడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దాంతో వారు మాస్టర్ కీతో గది తలుపులు తెరిచి చూడగా, మిచేల్ బెడ్‌పై అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు.

హోటల్ సిబ్బంది వెంటనే సమాచారం అందించడంతో 108 సిబ్బంది, గచ్చిబౌలి (Gachibowli) పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వైద్యులు పరీక్షించి ఆయన అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అయితే మిచేల్ మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Also Read : ‘దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికీ రూ.1,000’.. తస్మాత్ జాగ్రత్త!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>