ఏడాదిలో గిరిజన భవన్‌ నిర్మించాలి: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: మహబూబ్‌నగర్ నగరంలో గిరిజన భవన్ నిర్మాణానికి ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ శాఖ రూ.3 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని నగరంలోని మెట్టుగడ్డ, డైట్ కళాశాల దగ్గర గల స్థలాన్ని గౌరవ ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన భవనం భావితరాలకు ఒక జ్ఞాపకంగా నిలవడంతో పాటు, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు తరతరాలకు అందించేలా నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆధునిక హంగులతో, అన్ని అవసరాలకు అనుగుణంగా నూతన గిరిజన భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

భవిష్యత్తులో గిరిజనులకు సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించుకునేలా భవన నిర్మాణం చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతకు ఉపయోగపడే విధంగా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఏడాది కాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ఆర్.శేఖర్ నాయక్, లింగం నాయక్, లక్ష్మణ్ నాయక్, కె.శేఖర్ నాయక్, చంద్ర నాయక్, కిషన్ నాయక్, శ్రీనివాస్ యాదవ్, అంతిరాం నాయక్, తులసి రాం నాయక్, లోకేష్ , రవి నాయక్, ప్రతాప్ , ఈఈ రఘు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>