సింపుల్‌గా కావ్య‌, కాల‌భైర‌వ‌ల నిశ్చితార్థం!

క‌లం, సినిమా: టాలీవుడ్‌లో మ‌రో పెళ్లి సంద‌డి మొద‌లైంది. యంగ్ హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram), మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ కీర‌వాణి త‌న‌యుడు కాల భైరవ (Kaala Bhairava) త్వరలో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. ఆగస్టులో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా ఈ వేడుక జ‌రిగింది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఎంగేజ్‌మెంట్ వేడుకను నిర్వహించారు.

తాజాగా ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు ఈ జంటకు ముందస్తు విషెస్ చెప్తున్నారు. డిసెంబ‌ర్‌లో వీరి పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో విడుద‌లైన‌ ఫోటోల్లో కావ్య(Kavya Kalyanram), కాల భైరవల పేరెంట్స్‌, రాజ‌మౌళి దంప‌తులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపించారు.

Also Read : కొండగట్టు అంజన్న సన్నిధిలో ‘బసవ’ చిత్ర బృందం.. ప్రత్యేక పూజలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>