నిజామాబాద్‌లో ఇసుక సమన్వయ కమిటీ సమావేశం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలోని వివిధ క్వారీల నుండి నిబంధనలకు అనుగుణంగానే ఇసుక రవాణాకు అనుమతించడం జరుగుతోందని, ఈ విషయంలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) హెచ్చరించారు. కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, మైనింగ్, ఇంజినీరింగ్ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇసుక రీచ్ లను క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. మన ఇసుక వాహనం ఆన్‌లైన్‌ బుకింగ్ ద్వారా ఇసుక కేటాయింపులు జరగాలని, ఇసుక రవాణా విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులదేనని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిబంధనలను తూచ తప్పకుండా అమలయ్యేలా చూడాలని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తూ అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, జవహర్ నవోదయ విద్యాలయం భవన సముదాయాల నిర్మాణాలకు అవసరమైన ఇసుక నిల్వలను నిర్దేశిత ఇసుక రీచ్ ల నుండి తరలించేందుకు అనుమతించినందున ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్ఓ గీత, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, మైనింగ్ అధికారి బాలు, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>