కలం, వెబ్ డెస్క్: బిహార్ రాజధాని నగరం పాట్నాలోనిమనేర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ (Bihar Encounter) జరిగింది. శుక్రవారం పోలీసులతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నిందితులు మరణించారు. ఈ ఘటనపై పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్తికేయశర్మ వివరణ ఇచ్చారు. పాట్నాలోని షేర్పూర్ ప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్, జిల్లా పోలీసుల సంయుక్త బృందం పహారా కాస్తుండగా.. క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారని తెలిపారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని.. ఈ కాల్పుల్లో ముగ్గురు నిందితులు చనిపోయినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి గాయపడ్డట్లు తెలిపారు.

