ఈవీఎం గోదాం తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షిషా

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల గోదాంను (EVM,VVPAT Storage Warehouse) జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు.

అగ్నిమాపక వ్యవస్థ పనితీరు తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది పటిష్ట అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి నలంద ప్రియ, నాయబ్ తహసీల్దార్ మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>