కరీంనగర్‌లో అర్ధరాత్రి దారుణం.. బండరాయితో మోది యువకుడి హత్య!

కలం, వెబ్ డెస్క: కరీంనగర్‌ (Karimnagar) లోని ఆర్టీసీ బస్టాండ్ ఇన్‌గేట్ సమీపంలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్య (Murder) కు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. షాబాద్‌కు చెందిన మడ్డి సుధాకర్ అలియాస్ సిద్దు హత్యకు గురయ్యారు. మృతుడు స్థానికంగా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.

అశోక్ నగర్‌కు చెందిన ఇబ్రహీం బేగ్ అనే వ్యక్తి బండరాయితో మోది సుధాకర్‌ను దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే మద్యం మత్తులో జరిగిన గొడవే హత్యకు కారణమా? లేక పాత కక్షలా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : బెంగళూరులో దారుణం: ఒకే కుటుంబంలో ఏడుగురి హత్య!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>