కలం, వెబ్ డెస్క్ : ‘ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు యువతలో నైపుణ్యాల కొరత‘ అని ఏపీ విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం మన గ్రాడ్యుయేట్లలో కేవలం 51 శాతం మాత్రమే ఉద్యోగాలు సాధించారన్నారు. ఇది మన యువత మేధస్సు లోపం కాదు.. మనం బోధించే అంశాలకు, పరిశ్రమల అవసరాలకు కావాల్సిన నైపుణ్యాల మధ్య ఉన్న అసమతుల్యతే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
మన విద్యాసంస్థల్లో 3 నుండి 4 ఏళ్లు పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా యువతకు ఉద్యోగాలు రావడం లేదని లోకేశ్ పేర్కొన్నారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని కోచింగ్ సెంటర్లలో కేవలం 3 నుండి 4 నెలల శిక్షణతోనే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని.. ఈ అంతరాన్ని పూడ్చడానికే ఉన్నత విద్యలో ప్రాథమిక మార్పులు రావాలని లోకేశ్ అభిప్రాయపడ్డారు. డిగ్రీలతోపాటు క్రియాశీల నైపుణ్యాలపై దృష్టి సారించాలని లోకేశ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతలో స్కిల్ గ్యాప్ ను భర్తీ చేసేందుకే సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ‘స్కిల్ సెన్సస్’ (Skill Census) కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని తన నియోజకవర్గం మంగళగిరి నుంచే ప్రారంభిస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు.

Read Also: అతడి వల్లే నా జీవితం నాశనం: పూనమ్ కౌర్
Follow Us On: Sharechat


