ఒకే వేదిక‌పై త్రీ టాప్ పొలిటిక‌ల్ క‌పుల్స్!

క‌లం, వెబ్‌డెస్క్‌: చెన్నైలో జ‌రుగుతున్న వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) సోద‌రుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమారుడి పెళ్లికి దేశ వ్యాప్తంగా సినీ, రాజ‌కీయ‌, వ్యాపార‌ ప్ర‌ముఖులంతా హాజ‌ర‌వుతున్నారు. ఈ పెళ్లికి త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ హీరోయిన్ త్రిష‌ (Vijay Trisha)తో క‌లిసి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌తంలో సైతం వీళ్లిద్ద‌రూ జంట‌గా ఓ పెళ్లికి హాజ‌ర‌య్యారు. సీఎం విజ‌య్‌తో పాటు ఆయ‌న త‌ల్లి శోభ చంద్ర‌శేఖ‌ర్ కూడా పెళ్లికి వ‌చ్చారు. అలాగే కేటీఆర్ త‌న భార్య శైలిమ‌తో క‌లిసి వేడుక‌కు హాజ‌ర‌య్యారు. పెళ్లి వేదిక‌పై కొత్త జంట‌తో జ‌గ‌న్ దంప‌తుల‌తో పాటు కేటీఆర్ దంప‌తులు, విజ‌య్‌, త్రిష ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడుకు చెందిన మూడు జంట‌లు ఒకే ఫ్రేమ్‌లో సంద‌డి చేశాయంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. ఈ పెళ్లికి గౌత‌మ్ అదానీ దంప‌తులు కూడా హాజ‌ర‌య్యారు.

Also Read : మ‌ల్లీప్లెక్స్‌లో డ్రింక్స్‌ తాగుతున్నారా.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>