కరువు వేళ రైతులకు బ్యాంకర్లు అండగా నిలవాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో కరువు పరిస్థితులు ( Drought Conditions) నెలకొన్నందున అర్హులైన రైతులకు బ్యాంకర్లు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushbu Gupta) బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని వి.సి.కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కరువు పరిస్థితులు, రైతులకు బ్యాంకుల ద్వారా అందించాల్సిన సహాయక చర్యలు, పంట రుణాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై సమీక్షించారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కరువు ప్రభావిత మండలాలను గుర్తించిందని, జిల్లాలో చిన్న చింత కుంట,కోయిల్ కొండ తీవ్ర కరవు మండలాలుగా, గండీడ్ , హన్వాడ,మహబూబ్ నగర్ రూరల్,దేవరకద్ర అడ్డా కల్, మూసాపేట,.మహబూబ్ నగర్ అర్బన్,బాలా నగర్,రాజా పూర్,జడ్చర్ల, కౌకుంట్ల మధ్యస్థ కరవు మండలాలుగా ప్రకటించినట్లు కలెక్టర్ వెల్లడించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు ఉపశమనం కల్పించేందుకు ఎస్‌ఎల్‌బీసీ , ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం పంట రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సూచించారు.

తీవ్ర కరువు ప్రభావిత రెండు మండలాలకు రైతులకు 12 నెలల మారటోరియం కల్పించడంతో పాటు రుణాల చెల్లింపు కాలపరిమితిని మొత్తం 60 నెలల వరకు(మార టోరియం తో కలిపి)పొడిగించే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. మధ్యస్థ 11 కరవు మండలాలకు రైతులకు 12 నెలల మారటోరియం కల్పించడంతో పాటు రుణాల చెల్లింపు కాలపరిమితిని మొత్తం 36 నెలల వరకు(మార టోరియం తో కలిపి)పొడిగించే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. ఈ మార్గదర్శకాలను బ్యాంకర్లు సమర్థవంతంగా అమలు చేసి అర్హులైన రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నారు.

కరువు పరిస్థితుల కారణంగా రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమయంలో రుణాల చెల్లింపుల కోసం వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని కలెక్టర్ బ్యాంకు అధికారులకు స్పష్టం చేశారు. రైతుల పట్ల మానవతా దృక్పథంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి రైతుకు రుణ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కరువు ప్రభావిత రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు పూర్తి పిసహకారం అందించాలని, రైతులకు ఆర్థిక ఇబ్బందులు తగ్గించేలా సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్

అవగాహన సదస్సులు నిర్వహించాలి

మండలాల వారీగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి.. రైతు వేదికలు, గ్రామసభల ద్వారా వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో బ్యాంకులు అందిస్తున్న సేవలు వివరించాలని అధికారులకు సూచించారు. అర్హులైన రైతులకు కొత్త రుణాలు అందించి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల కు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని సూచించారు.

ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ ల ద్వారా ప్రభుత్వం మంజూరు చేసే రుణాలను అర్హులకు బ్యాంకు సిబ్బంది అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్,ఎల్.డి.యం.చంద్ర శేఖర్,నాబార్డ్ ఏ.జి.యం.షణ్ముఖ చారి,బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ లు ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>