కలం, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ (MLC Graduate Voter Registration) కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ (Help Desk) ను తహసిల్దార్ దశరథ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసి, స్థానికంగా ఓటు హక్కు కలిగి ఉన్న అర్హులైన పట్టభద్రులు ఈ హెల్ప్ డెస్క్‌ను సంప్రదించి, ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలు, సహాయాన్ని పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి జిపిఓలు స్రవంతి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

