కలం, వలిగొండ: తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు గురువారం వలిగొండ (Valigonda) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్స్– టీచర్స్ మీటింగ్ (PTM) సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఎస్ఏ-1 రిజల్ట్స్, విద్యార్థుల లెర్నింగ్ కేపబిలిటీపై చర్చించారు.
పరీక్ష ఫలితాలకు సంబంధించి కేవలం మార్కులే కాకుండా, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధిని ప్రతిబింబించేలా రూపొందించిన హోలీస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల ప్రగతి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని ఉపాధ్యాయులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమాలలో మండల విద్యాశాఖ అధికారి సుంకోజు భాస్కర్, ఉపాధ్యాయులు ఎండీ జిలాని, పోలేపాక నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

