ఏపీలో నెమ్మదిగా పోలింగ్.. పలు చోట్ల ఉద్రిక్తత

కలం, వెబ్ డెస్క్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Local Body Elections) భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ నెమ్మదిగా పెరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 21.12 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా మార్కాపురం జిల్లాలో 36.66 శాతం, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 11.81 శాతం జరిగింది. విశాఖలో 35.4 శాతం, కాకినాడ జిల్లాలో 27.25 శాతం, కడపలో 26.85 శాతం, కృష్ణా జిల్లాలో 25.81 శాతం, నంద్యాల జిల్లాలో 25.41 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 27.45 శాతం, అనంతపురంలో 28.88 శాతం, చిత్తూరు జిల్లాలో 32.97 శాతం, అన్నమయ్య జిల్లాలో 25.73 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 21.18 శాతం, పల్నాడులో 30.18 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.

కొనసాగుతున్న ఘర్షణలు..

పోలింగ్‌లో భాగంగా వివిధ జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తిరుపతి జిల్లా సాయినగర్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారని కొందరు వ్యక్తులను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. కడప జిల్లా రామాపురంలో దొంగ ఓట్లు వేస్తున్నారని కొందరిని గ్రామస్థులు చితకబాదారు. కర్నూల్ జిల్లాలో శిల్పా రవి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Also Read : కిలో రూ.1.23 లక్షలా? జైపూర్‌లో ఊరిస్తున్న ఆ స్వీట్ ఏంటి?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>