ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం: నదిలోకి దూసుకెళ్లిన కారు!

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో విషాదం (Uttarkashi Accident) చోటుచేసుకుంది. గంగోత్రి జాతీయ రహదారిపై దాబ్రాణి సమీపంలో ఇన్నోవా కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తూ నదిలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్య ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ (SDRF), 108 అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని లెక్కచేయకుండా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : పోలీసులకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>